calender_icon.png 8 January, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

02-01-2025 02:18:57 AM

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సంద ర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యే క రైలు సర్వీసులను నడుపనున్నది. ఈ నెల 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడ నుంచి కాకినాడ టౌన్‌కు రెండు రైళ్లను, ఈ నెల 10, 12 తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు కాకినాడ టౌన్ నుంచి కాచిగూడకు రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు అధికారులు తెలిపారు.

ఈ నెల 11న రాత్రి 8 గంటలకు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు మరో ప్రత్యేక రైలు బయలుదేరుతుందని వెల్లడించారు. ఈ రైళ్లు మల్కాజిగిరి, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట తదితర స్టేషన్లలో ఆగుతాయని వివరించారు.