calender_icon.png 6 February, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

06-02-2025 12:01:52 AM

కర్నూలు, మహబూబ్‌నగర్, కాచిగూడ మీదుగా..

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాం తి): తిరుపతి నుంచి కర్నూలు, మహబూబ్ నగర్, కాచిగూడ మీదుగా కుంభమేళాకు (ప్రయాగ్‌రాజ్) 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లు మార్గమధ్యలో రేణిగుం ట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, గద్వాల, వనపర్తి రోడ్, జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్, మల్కాజ్‌గిరి, చర్లపల్లి, కాజీపేట, పెద్దపల్లి, రామగుం డం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బలార్షా, నాగ్‌పూర్, ప్రయాగ్‌రాజ్ తదితర స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది. కుంభమేళా నేపథ్యంలో ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియో గం చేసుకోవాలని సీపీఆర్‌వో ఏ శ్రీధర్ కోరారు. 

ప్రత్యేక రైళ్ల వివరాలు..

ఈ నెల 14న రాత్రి 11.45 గంటలకు తిరుపతి నుంచి రైలు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు దానాపూర్ (పాట్నా) చేరుకుంటుంది.  17న మధ్యా హ్నం 3.15 గంటలకు దానాపూర్ (పాట్నా) నుంచి రైలు 8 బయలుదేరి మరుసటి రోజు రాత్రి 2.55 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

18న రాత్రి 11.45 గంటలకు తిరు పతి నుంచి రైలు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. 21న మధ్యాహ్నం 3.15 గంటలకు దానాపూర్ నుంచి రైలు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 2.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.