చర్లపల్లి టెర్మినల్ నుంచి రవాణా సేవలు
హైదరాబాద్, జనవరి 28(విజయక్రాంతి): ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు ద.మ.రైల్వే చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి దానాపూర్ (పాట్నా)కు నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపనున్నది. ఇవి ఫిబ్రవరి 5, 7వ తేదీల్లో నడుస్తాయి.
రైళ్లు చర్లపల్లి నుంచి బయల్దేరి జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బలార్షా, చంద్రాపూర్, సేవాగ్రాం, నాగ్‌పూర్, ఇటార్సి, పిపారియా, జబల్పూర్, కాట్ని, సాత్నా, మాణిక్పూర్, ప్రయాగ్‌రాజ్, మీర్జాపూర్, పండిడ్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, ఆరా స్టేషన్లలో ఆగుతాయి. ప్రయాణానికి రిజర్వేషన్, జనరల్ టికెట్ సౌకర్యం ఉంటుంది.
రైళ్ల వివరాలు...
రైలు నంబర్ 07079 ఫిబ్రవరి 5న మధ్యాహ్నం 3 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి ఫిబ్రవరి 6న అర్ధరాత్రి 11.55కు దానాపూర్ చేరుకుంటుంది.
రైలు నంబర్ 07080 ఫిబ్రవరి 7న మధ్యాహ్నం 3 గంటలకు దానాపూర్‌లో బయల్దేరి ఫిబ్రవరి 8న అర్ధరాత్రి 11.45కు చర్లపల్లి చేరుకుంటుంది.
రైలు నంబర్ 07077 ఫిబ్రవరి 7న మధ్యాహ్నం 3 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి ఫిబ్రవరి 8న అర్ధరాత్రి 11.55కు దానాపూర్ చేరుకుంటుంది.
రైలు నెం. 07078 ఫిబ్రవరి 9న మధ్యాహ్నం 3.15 గంటలకు దానాపూర్‌లో బయల్దేదేరి ఫిబ్రవరి 10న అర్ధరాత్రి 11.45కు చర్లపల్లి చేరుకుంటుంది.