హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): దసరా, దీపావళి సందర్భంగా ద.మ.రైల్వే 24 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. సికింద్రాబాద్ తిరుపతి మధ్య వచ్చే నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 6 రైళ్లు, తిరుపతి సికింద్రాబాద్ మధ్యన వచ్చే 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 6 రైళ్లను నడుపనున్నారు. ఈ రైళ్లు మహబూబ్ నగర్, గద్వాల, కర్నూలు, గుత్తి, కడప మీదుగా నడుస్తాయి. తిరుపతి శ్రీకాకుళం మధ్యన వచ్చే నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు, శ్రీకాకుళం తిరుపతి మధ్యన వచ్చే నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 12 రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.