13-02-2025 01:24:45 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): రద్దీ నేపథ్యంలో చర్లపల్లి నుంచి కాకినాడ, నర్సాపూర్‌కు 8 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నట్లు ద.మ.రైల్వే అధికారు లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14, 21 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లు (నెం.07 031)చర్లపల్లి నుంచి రాత్రి 7.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజాము న 4.30 గంటలకు కాకినాడకు చేరుకోనున్న ట్టు వెల్లడించారు.
అలాగే 16, 23 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లు (నెం.07032) కాకినాడ టౌన్‌లో సాయంత్రం 6.55 గంటలకు బయ ల్దేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంట లకు చర్లపల్లికి చేరుకుంటాయని పేర్కొన్నా రు. 14, 21 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లు (నెం. 07233) చర్లపల్లిలో రాత్రి 7.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు నర్సాపూర్‌కు చేరుకోనున్నట్టు తెలిపారు. అలాగే 16, 23 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లు (నెం.07234) నర్సాపూర్‌లో రాత్రి 8కి బయల్దేరి మరుసటి రోజు ఉద యం 8కి చర్లపల్లి చేరుకుంటాయన్నారు.