05-04-2025 12:06:00 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): ఆత్మరక్షణ శిక్షణ ప్రతి విద్యార్థికి అవసరమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నార. జేఎన్‌ఎస్ ఇండోర్ స్టేడియంలో బాలికల స్వీయ రక్షణకు యూఎస్‌ఏ లో స్థిరపడ్డ గ్రాండ్ మాస్టర్ గూడూరు సుధాకర్ చే (బ్రూస్) ఆత్మరక్షణ మెలుకువళ (సెల్ఫ్ డిఫెన్స్) శిక్షణ శిబిరాన్ని నాయిని రాజేందర్ రెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బాలికలపై పెరుగుతున్న నేరాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని వారి భద్రతను నిర్ధారించడానికి పాఠశాలల్లో వారికి ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వాలని, ఒక జీవిత నైపుణ్యం అని ఇది అమ్మాయిలు తమ పరిసరాల గురించి మరింత అవగాహన కలిగి ఉండటానికి ఏ సమయంలోనైనా ఊహించని వాటికి ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండటానికి సహాయపడుతుందని అన్నారు.
బాలికలకు ఆత్మరక్షణ, ఆరోగ్యం, ఫిట్నెస్, ఆత్మబలాభివృద్ధిని నేర్పించడం ద్వారా వారికి సాధికారత కల్పించినట్టు అవుతుందని, బాలికలు వారి ఆత్మరక్షణపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని అలాగే సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు తీసుకోవడం వలన వారిని వారు కాపాడుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోరట్స్ అధికారి, టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బిన్నీ లక్ష్మన్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట పవన్ పాల్గొన్నారు.