calender_icon.png 7 March, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు

06-03-2025 11:33:43 PM

ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై ప్రధాని మోదీ స్పందన

విజేతలు కొమురయ్య, అంజిరెడ్డిలకు అభినందన

కార్యకర్తల కృషి పట్ల గర్వంగా ఉంది

న్యూఢిల్లీ: తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీపై నమ్మకం ఉంచి పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ అభ్యర్థులను అభినందించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందించిన మోదీ..‘ టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన మల్క కొమురయ్యకు, పట్టభద్రుల ఎమ్మెల్సీగా నెగ్గిన అంజిరెడ్డికి అభినందనలు. పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలతో మమేకమై అహర్నిశలు శ్రమించిన పార్టీ కార్యకర్తల కృషిని చూసి గర్విస్తున్నా’ అని పేర్కొన్నారు. 

ఉమ్మడి  కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి కాంగ్రెస్‌కు చెందిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అదే నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి జరిగిన ఎన్నికలో బీజేపీ బలపరిచిన మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్ల తేడాతోనే గెలుపును అందుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీలకు కూడా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్‌ను రీపోస్ట్ చేసిన ప్రధాని.. కేంద్రం, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందన్నారు.