calender_icon.png 3 February, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు

03-02-2025 12:24:19 AM

ఎంపీ డీకే అరుణను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన టీజీవో నేతలు 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి) : ఉద్యోగులకు సంబంధించి ఇన్కమ్ టాక్స్ స్లాబ్ రేట్స్  ను రూ 5 లక్షల నుంచి రూ 12 లక్షలకు పెంచిన  సందర్భంగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను తెలంగాణ గజిటెడ్ అధికారుల అసోసియేషన్ నేతలు కలిసి పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో టీజీవో రాష్ర్ట ఉపాధ్యక్షులు  మాచర్ల రామకష్ణ  గౌడ్, జిల్లా అధ్యక్షులు ఎస్. విజయ్ కుమార్, సెక్రెటరీ  కే వరప్రసాద్, అసోసియేట్ అధ్యక్షుడు ఆర్ రవీందర్ రెడ్డి ట్రెజరర్  కే టైటాన్స్ పాల్, పబ్లిసిటీ సెక్రెటరీ జి జగదీష్ కుమార్,  ఇతర గజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు.