ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి, (విజయక్రాంతి): టిటిడి తరహాలో యదగిరిగుట్టలో టెంపుల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కి ఆలేరు ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శనివారం యదగిరిగుట్ట లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ. టిటిడి తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. టిటిడి అనుసరించిన తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ద్వారా స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయడం ద్వారా యాదగిరిగుట్ట ఆలయం అభివృద్ధి జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధికి కృషి చేయడం అదృష్టంగా బావిస్తున్నామన్నారు. దీంతోపాటు యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.గత ప్రభుత్వంలో యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు చాలా వరకు అర్థవంతరంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని,ఇప్పటి వరకు జరిగిన పనులపై నివేదికను అందించాలని ఆదేశించడం శుభ పరిణామం అన్నారు. టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆలేరు నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టూరిజం లో భాగంగా యాదగిరిగుట్టలో అన్ని సౌకర్యాలు, అహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికృషి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ నాయకత్వంలో ఇప్పటికీ పూర్వ వైభవం కోసం అనేక అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.