calender_icon.png 22 April, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు

22-04-2025 02:07:28 AM

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): తెలంగాణ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను హైదరాబాద్ బస్తీల్లో, పేదలున్న ప్రాంతాల్లో, పల్లెల్లో పెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. స్క్రీనింగ్ సెంటర్ల ఏర్పాటుకు చొరవ తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

క్యాన్సర్‌తో అనేక మంది చనిపోతున్నారని,  క్యాన్సర్ కారణంగా పేద మద్య తరగతి ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. క్యా న్సర్‌ను ముందే గుర్తించి వైద్యం అం దించే బాధ్యత ఇప్పటి ప్రభుత్వం తీసుకోవడం సంతోషకరమన్నారు. పేదలకు క్యాన్సర్ మహమ్మారిని తట్టుకుంటామనే మనోధైర్యాన్ని ప్రభుత్వం కల్పించిదన్నారు.