calender_icon.png 15 March, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ బలరాంకి ప్రత్యేక ధన్యవాదాలు

11-03-2025 08:43:09 PM

AAS జిల్లా ఇన్చార్జ్ బొడికల ప్రేమ్ దయాళ్..

కొత్తగూడెం (విజయక్రాంతి): ఇచ్చిన మాట ప్రకారం దేశ రక్షణ శాఖలో ఉద్యోగం చేసిన వైద్యుల నియామకం సింగరేణి సంస్థలో నెలకొన్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని, సింగరేణియులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని పలు అంశాలపై ఆజాద్ అధికార్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ బొడికల ప్రేమ్ దయాళ్ జనవరి నెలలో మొదటి సారి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఐఆర్ఎస్ ను మర్యాద పూర్వకంగా కలిసి చేర్చించి వినతి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించి సుముఖత చూపారు.

మెడికల్ బోర్డు పేరుతో దోచుకు తినడం, కార్మికుల కష్టం వృథా కాకుండా మెడికల్ బోర్డు నిర్వహణలో అవకతవకాలకు అవకాశం ఉండకుడదని, ఇందులో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం దేశ రక్షణ శాఖలో ఉద్యోగం చేసిన వైద్యులను నియమించి వారిచే పారదర్శకంగా మెడికల్ బోర్డు నిర్వహణ చేపడతానని చీఫ్ మెడికల్ సర్వీస్ అధికారి నియామక నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల సంస్ధ ఎండి బలరాంకి ప్రత్యెక ధన్యవాదాలు తెలియజేశాడు.