calender_icon.png 1 March, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు

01-03-2025 12:52:37 AM

15 మంది ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్

 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

ఖమ్మం, ఫిబ్రవరి -28 (విజయక్రాంతి ):  గత 25 నుంచి 30 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తూ ప్రజలకు నిర్విరామంగా అందించిన సేవలకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం పదవి విరమణ పొందుతున్న 15 మంది అధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ  క్షేత్ర స్థాయిలో కార్యాలయ సబార్డినేట్లు విధి నిర్వహణలో తమకు చాలా మద్దతు అందిస్తారని అన్నారు. పదవి విరమణ తర్వాత కుటుంబంతో అధిక సమయం గడపాలని కలెక్టర్ సూచించారు. పదవి విరమణ పొందుతున్న ప్రతి ఉద్యోగి గత 25 నుంచి 30 సంవత్సరాలుగా ప్రభుత్వానికి వివిధ స్థాయిలలో సేవలు అందించారని కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవలు అందించేందుకు గత 30 సంవత్సరాలుగా నిర్విరామంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు పదవి విరమణ పొందిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు శ్రీజ, శ్రీనివాస రెడ్డి,జెడ్పి సిఇఓ దీక్షా రైనా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. కళావతి బాయి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.