calender_icon.png 20 April, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి

17-04-2025 12:13:32 AM

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): జిల్లాలో క్రికెట్ బెట్టింగులు, ప్రభుత్వ నిషేధిత గంజాయి అక్రమ రవాణా, ఇతర  అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజ్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా స్థాయి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా సమగ్ర విచారణ చేపట్టి నేరస్తులకు శిక్షపడేలా పనిచేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ కృషి చేయాలన్నారు.

పెట్రోలింగ్,బ్లూ కోలడ్స్ వాహనాలు నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని,డయల్ 100 నకు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలబడాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులు,సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్,ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,ఐటి సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్ మరియు సీఐలు, ఎస్త్స్రలు,జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.