calender_icon.png 22 March, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా

22-03-2025 12:06:09 AM

విధ్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు ఎస్పీ శరత్ చంద్రపవార్ 

నల్లగొండ, మార్చి 21 (విజయక్రాంతి) : సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎస్పీ శరత్చంద్ర పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుల, మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలైన వాట్సాప్,ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్లో కులాలు, మతాలు, వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు, విధ్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు పోస్టు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. తప్పుడు పోస్టులను షేర్ చేసినా శిక్షతప్పదని పేర్కొన్నారు.