- మత్తు పదార్థాల రవాణా కట్టడికే వాహన తనిఖీలు
- సైబర్ మోసాలపై ప్రజలకు అవగహన కల్పిస్తున్నాం..
- హైదరాబాద్ మల్టీ జోన్ ఐజీ వి.సత్యనారాయణ
సంగారెడ్డి, ఆగస్టు 3 (విజయక్రాంతి): గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని హైదరాబాద్ మల్టీ జోన్ ఐజీ వి. సత్యనారాయణ అన్నారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడారు. మత్తు పదార్థాలతో పాటు గుట్కా, పాన్ మసాలా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ప్రజలు అత్యవ సర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. మత్తు పదార్థాల రవాణా ను కట్టడి చేసేందుకే పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారని తేల్చిచెప్పారు.
మట్కా, పేకాట వంటి జూదాన్ని సహించబోమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన చౌరస్తాల్లో సీసీ కెమెరాలు, అల్మాస్ లైట్లు ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ చెన్నూ ర్ రూపేశ్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 356 మంది నిందితులపై హిస్టరీ షీట్స్ తెరిచామన్నారు. గంజాయితోపాటు ఇతర మాదక ద్రవ్యాల కట్టడి కోసమే ‘ఎస్ పనిచేస్తున్నదన్నారు. సైబర్ మోసా లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం ‘మై ఆటో సేఫ్’ను అమలు చేస్తున్నామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవ్‌రావు, డీఎస్పీ లు సత్యయ్య గౌడ, రవీందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.