హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (విజయక్రాంతి): న్యూ ఈయ వేడుకల వేళ హైదరాబాద్ మహానగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో శనివారం బంజారాహిల్స్, ఉప్పల్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, ఫిల్మ్‌నగర్, సరూర్‌నగర్ పబ్‌లలో సోదాలు నిర్వహించారు.
వేడుకల పేరుతో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని యజమానులకు ఆదేశాలు జారీచేశారు. డ్రగ్ ఫ్రీ వేడుకలు నిర్వహిస్తామని యజమానుల నుంచి అండర్ తీసుకుంటునానరు. ఇప్పటికే కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించే వారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ జారీచేశారు. డ్రగ్స్ విక్రయాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టామని తెలిపారు.