calender_icon.png 14 March, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశి దారు రవాణాపై ప్రత్యేక నిఘా

14-03-2025 01:30:52 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): దేశదారు అక్రమ రవాణాపై నిఘా పెంచినట్లు ఎక్సైజ్ సీఐ రమేష్ కుమార్ తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్ అదేశాల మేరకు గురువారం  మహరాష్ట్రలోని చంద్రపూర్ నుంచి సిరోంచకు వెళుతున్న మహరాష్ట్ర ఆర్టీసీ బస్సును అదిలాబాద్ ఎక్స్ రోడ్ వద్ద తనిఖీ చేయగా 226 దేశీదారు బాటిళ్లను స్వాదీనం చేసుకుని ఒకరిని అదపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. వీటి విలువ రూ.7910 ఉంటుందన్నారు. గ్రామాలలో దేశదారు అమ్మిన ,రవాణా చేస్తున్న తమ సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, కానిస్టేబుళ్లు రజిత, తిరుమల పాల్గొన్నారు.