తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్
శేరిలింగంపల్లి, జనవరి 19 (విజయక్రాంతి): యువత ప్రతి నిత్యం వ్యాయామం చేస్తే రోజువారీ పనుల్లో కొత్త ఉత్తేజం వస్తుందని తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్ తెలిపా రు. అదివారం వరల్ పవర్ లిప్టింగ్ తెలంగాణ శాఖ ఆధ్వ ర్యంలో చందానగర్ హుడాకాల నీలో డి క్రాస్ ఫిట్ నెస్ స్టూడి యోస్ లో నిర్వహించిన పవర్ లిప్టింగ్ చాంపియన్ షిప్ పోటీలను కొండ విజయ్ ము ఖ్య అతిథిగా హాజరై ప్రారం భించారు.
ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ. నగరంలో సరికొత్త హంగులతో జిమ్ ఏర్పాటుతో యువతలో శారీరకంగా దృడంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పవర్ లిప్టింగ్ పోటీలు స్నేహ పూర్వక వాతావరణం ఏర్పాటు చేస్తాయని కొండ విజయ్ కుమార్ పేర్కోన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్ లిప్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రేఖ, కార్యదర్శి తిరుపతి, ప్రసాద్, సూనిల్ రాజ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.