calender_icon.png 5 February, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెట్రోలో స్పెషల్ సాంగ్..

05-02-2025 12:26:32 AM

శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరితోనూ.. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించింది. ప్రస్తుతం ఆమె అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది.

‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించిన తర్వాత ఆమె సినిమాల్లో కనిపించిందే లేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఇదిలా ఉండగా శ్రియా చాలా గ్యాప్ తర్వాత ఓ స్టార్ హీరో చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరవనుందని సమాచారం.

సూర్య, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘రెట్రో’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రియా ఒక ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేయనుందట.

1980ల బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఏడాది మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.