calender_icon.png 4 February, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు

04-02-2025 10:34:56 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ(Telangana Legislative Assembly), మండలి ప్రత్యేక సమావేశాలు మంగళవారం జరుగనున్నాయి. బీసీ కులగణన(BC Caste Census), ఎస్సీ వర్గీకరణ(SC Classification) అంశాలపై డెడికేషన్ కమిటీ నివేదికలు ఏకసభ్య న్యాయ కమిటీ(Single-Member Judicial Committee) కేబినెట్ ముందుకు ఉంచనుంది. ఈ అంశాలపై కేబినెట్ ఆమోదం తర్వాత శాసనసభలో చర్చిస్తారు. ఇవాళ ఉదయం 11 గంటలకు శాసనసభ, మండలి సమావేశం నిర్వహిస్తారు. అనంతరం కులగణన, ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీలో, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) మండలిలో ప్రకటన చేయనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పనపై తీర్మానం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణపై తెలంగాణ క్యాబినెట్ సబ్‌కమిటీ రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని  వన్-మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్ నుండి నివేదికను అందుకుంది. ఎస్సీ ఉపకులాలను 4 కేటగిరీలుగా విభజించాలని సిఫారసు చేసినట్లు సమాచారం. ఏకసభ్య కమిషన్ సిఫారసులపై ఉభయసభల్లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.