హైదరాబాద్: డిసెంబర్ 26న కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్(Manmohan Singh)కు నివాళులర్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సోమవారం జరగనుంది. తెలంగాణ మూడో అసెంబ్లీ నాలుగో సెషన్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) రెండో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర శాసనసభ కార్యదర్శి జారీ చేసిన నోటీసు ప్రకారం డిసెంబర్ 30 ఉదయం 10 గంటలకు సంతాప దినాల సందర్భంగా ప్రత్యేక సభను ఏర్పాటు చేశారు. మన్మోహన్ సింగ్ గౌరవార్థం డిసెంబర్ 27న రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఏడు రోజుల సంతాప దినాలు కూడా ప్రకటించింది. రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్‌కు పార్టీలకతీతంగా సభ్యులు నివాళులు అర్పిస్తారు.