ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్, కమిషనర్..
ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah), జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil) సహకారంతో పట్టణంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్(Sanitation Drive) కార్యక్రమం నిర్వహించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రధాన ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమాన్ని శనివారం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ... పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపాలిటీ అంతా పరిశుభ్రంగా తయారు కావాలని ప్రతి కాల్వ ప్రతి లైన్ శుభ్రంగా ఉండాలని తెలిపారు.
ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో చెత్తను బయట వెయ్యరాదని వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశుద్ధ కార్మికుల శ్రమ వృధా కానీయొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ మేనేజర్ అంకుషావలి, డి ఈ మురళి, ఆలయ కమిటీ చైర్మన్ సదానందం, వార్డు కౌన్సిలర్లు వారా రవి, కటకం పద్మావతి, సయ్యద్ ఆజాం, ఎలమందల వీణ, చీమల సుజాత, ఏఈ శంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్, నాయకులు నయీమ్, మున్సిపాలిటీ జవాన్లు, పరిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.