calender_icon.png 26 October, 2024 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రత్యేక గుర్తింపు

15-09-2024 04:07:20 PM

మర్రి వెంకటస్వామి సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి

కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సాయిధ పోరాట వీరుడు  అనభేరి ప్రభాకర్ రావు సొంత గ్రామం పొలంపెళ్లిలో తిమ్మాపూర్ మండల కార్యదర్శి బోయిని తిరుపతి ఆధ్వర్యంలో అనభేరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకట స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. 

దానిలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో అనభేరి  విగ్రహానికి పూలమాలలు వేసి ఘన  నివాళులర్పించడం జరిగింది ప్రభాకర్ రావు గారు ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ పేద ప్రజల కొరకు బడుగు బలహీన వర్గాల కొరకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిజాం సర్కారుకు ఎదురోడ్డు హైదరాబాద్ సంస్థానాన్ని తెలంగాణలో విలీనం అయేంతవరకు విరోచిత పోరాటం చేసి చివరకు మహమ్మదాపూర్ గుట్టల్లో నిజాం సర్కార్ చేతిలో ఎన్కౌంటర్ చేయబడ్డాడు.

  కావున ఈరోజు అతను మరణించిన చోట హుస్నాబాద్ పరిధిలోని మహమ్మదాపూర్ లో బైక్ ర్యాలీ నిర్వహించి అతని సమాధి వద్ద నివాళులు గడిచి సభ నిర్వహిస్తామని తెలపడం జరిగింది రాబోయే తరాలగూడ అనాబెరి చరిత్ర తెలియాలంటే పాఠ్య పుస్తకాలలో అతని జీవిత చరిత్రను రాయాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కార్యదర్శి బోయినీ తిరుపతి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ కంతల తిరుపతిరెడ్డి, మర్రి కొమురయ్య అవునురి  రమేష్ గుద్దెనపల్లి సొసైటీ చైర్మన్ అనబెరి రాధా కిషన్ రావు,  పోలంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుంటి మల్లేష్, సిపిఐ హమాలి సంఘం నాయకులు పబ్బల అయిలయ  శ్రిషెలం శ్రీనివాస్  గ్రామస్తులు పాల్గొన్నారు.