* డీఎస్ చౌహాన్‌కు పురస్కారం అందజేత
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ఆహార ధాన్యాల రవాణాలో రూట్ ఆప్టిమైజేషన్ అమలుకు గానూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రతిష్టాత్మకమైన ప్రశంసతోపాటు పురస్కారాన్ని ఆశాఖ కమిషనర్ డీఎస్‌చౌహాన్‌కు శుక్రవారం అందించారు. 28 ఫిబ్రవరిలో అన్ని రాష్ట్రాల ఆహార కార్యదర్శులతో ఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో సమావేశంలో చౌహాన్ రూట్ ఆప్టిమైజేషన్‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజాపంపిణీలో విన్నూత విధానాన్ని అనుసరించిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. ఆహారధాన్యాల పంపిణీలో ప్రజాధనం ఆదా చేయడంతోపాటు లబ్ధిదారులకు పారదర్శకత, లభ్యతను చేకూర్చింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పౌరసరఫరాల శాఖ జవాబుదారీతనం, స్థిరత్వాన్ని ప్రోత్సహించే జీపీఎస్ ట్రాకింగ్ వంటి ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ సప్లు చైన్ మేనేజ్‌మెంట్‌ను ఆధునీకరించారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ప్రజాసేవకు చేసిన విశేష కృషికి చౌహాన్ ప్రశంసలు పొందారు.