భక్తులతో కిక్కిరిసిన ఆలయం
మానకొండూర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ ఎండి కాలనీలో గల శ్రీ మృత్యుంజయ మహా దేవాలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి శివుడికి అభిషేకాలు చేస్తూ ఓం నమశివాయ అనే నామస్మరణలతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి రావడంతో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు. భక్తులు కార్తీక దీపాలను వెలిగించి భక్తి పారవశ్యంతో పులకరించిపోయారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీతో పాటు మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి, ఆలయ అర్చకులు పురుషోత్తంలతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎల్ఎండి లోగల శివాలయంలో జ్యోతిష్మతి వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల యువతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దేవుని వేడుకున్నారు. అనంతరం సాయంత్రం ఆకాశదీపంతో పాటు పలువురు దీపాలను ఆలయంలో వెలిగించారు.