calender_icon.png 28 March, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాలయంలో ప్రత్యేక పూజలు

16-12-2024 10:48:54 PM

రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ఉన్న శివాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సోమవారం రోజు ఆలయంలో శివునికి అభిషేకము చేసి ప్రత్యేక పూజలు చేశారు. శివుని ఆశీస్సులతో గ్రామంలో అందరికీ మంచి జరగాలని కోరుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు టిపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు, అల్లాడి వెంకటేష్, రమేష్ రెడ్డి, నాగులు, జహీరుద్దీన్, బొట్ల బాబు, శ్రీధర్ రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శివాలయం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.