31-03-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైమ్, మార్చి30(విజయక్రాంతి):విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలోని 6వ డివిజన్లోని యజ్ఞ వరహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పంచాంగ శ్రవణం లో పాల్గొన్న మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్.
ఈ వేడుకలల్లో ఎమ్మెల్యే గంగుల కుటుంబ సభ్యులతో పాటు శ్రీ యజ్ఞ వరహస్వామి ఆలయ కులపతి భాష్యం వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్ రెడ్డి, నగర బి ఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ కోల మాలతి -సంపత్ రెడ్డి, బిఆర్ ఎస్ నాయకులు గందె మహేష్, బోనాల శ్రీకాంత్, ఒంటెల సత్యనారాయణరెడ్డి, ఐజేందర్ యాదవ్, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్,కలర్ సత్తన్న, ఆలయ కమిటీ బాద్యులు సాయిని నరేందర్, రాణి- వెంకటేశ్వర్ రెడ్డి, లు పాల్గొన్నారు. ఉస్మానియా, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జ్యోతిష విభాగం అధ్యక్షురాలు డాక్టర్ ప్రతిభ పంచాంగ పటణం చేశారు.