13-03-2025 10:28:07 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో పురస్కరించుకొని శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానల దివ్యపాదుకలకు అభిషేకము అర్చన కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. వంశాభివృద్ధి పూజను నిర్వహించారు. ఈ వంశాభివృద్ధి పూజ యొక్క మహా సంకల్పం ఈ పౌర్ణమి రోజున ఎవరైతే శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులను అర్చించి ఆరాధించి ఈ పూజలో పాల్గొంటారు. వారి వంశాన్ని రక్షించాలనేటువంటి మహా సంకల్పంతో శ్రీ పరంజ్యోతి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం పైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో అక్కాపూర్ రోడ్డులో ఈరోజు ఆర్యవైశ్య సంఘం సహాయంతో దాదాపు 400 నుండి 500 మంది వరకు అన్న ప్రసాద వితరణను చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పరంజ్యోతి సేవా సంఘం కామారెడ్డి సేవకులు ఎర్రం విజయ్ కుమార్, సిద్ధంశెట్టి శ్రీనివాస్, మాచారెడ్డి మండల ఆర్యవైశ్య సంగం సభ్యులు పాల్గొన్నారు.