25-02-2025 02:11:59 AM
శివరాత్రికి ప్రత్యేక కార్యక్రమాలు
కామారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో శివరాత్రి ఉత్సవాలకు శివాలయాలు ముస్తాబయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ విశ్వేశ్వర శివాలయము గోపాలస్వామి రోడ్ లోని శివాలయం ముదాము గల్లీలోని విశ్వేశ్వర స్వామి దోమకొండలోని శివరాం మందిర్ దోమకొండ గడి కూటంలోని మహాదేవుని ఆలయం, భిక్కనూరు మండ లం సిద్దరామేశ్వరాలయం సదాశివ నగర్ మండలం కేంద్రంలోని విశ్వేశ్వర ఆలయం ,మల్లన్న గుట్ట వద్దగల శివాలయం, రామారెడ్డి మండలం మద్దికుంట బుగ్గ రామలింగే శ్వర ఆలయం, బండ రామేశ్వర్ పల్లి లో శివాలయం, క్యాసంపల్లి రాజరాజేశ్వరాలయం, కృష్ణాజివాడిలోని రాజరాజేశ్వ రాలయం, నాగిరెడ్డిపేట మండలంలోని త్రిలింగేశ్వర ఆలయం బాన్సువాడ మండలంలోని దుర్గిలోని సోమలింగేశ్వర ఆల యాలు ముస్తాబు అయ్యాయి.
తాడువాయి మండలము సంతాయి పేట భీమేశ్వర ఆలయం ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రి పండుగ సందర్భంగా ఉపవాస దీక్షలతో భక్తులు శివాలయాలను సందర్శించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. శివ స్వాములు శ్రీశైలం వెళ్లి తమ మాలాధారణ విరమించనున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని దుర్గి సోమలింగేశ్వర ఆలయం నుంచి శివ భక్తులు పాదయాత్ర శ్రీశైలం వరకు చేపట్టారు.
దోమకొండ శివరాం మందిర్
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శివరాం మందిర్ ఆలయంలో ప్రతి ఏట నిర్వహించే శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమైనా యి. గంగాపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం, అత్యంత వైభవంగా నిర్వహించారు. శేష సాయి పై స్వామివారి ఊరేగింపు. నంది వాహనం , మంగళవారం ఊరేగింపు, శేషసాయి పై స్వామివారి ఊరేగింపు. గంగాపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి కల్యాణోత్సవం, స్వామివారి రతరోహణ, గంగా పూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి, సీతారామచంద్రస్వామి వ్రతములు స్థానిక ప్రయాణ ప్రాంగణం వద్దకు బయలుదేరుట, లంక దహనం, తిరిగి వ్రతములు ఆలయం కు ప్రవేశించడం, 27న ఉదయం చక్రతీర్థం, జాతర ఉత్సవాలు నిర్వహించ నున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కొండ అంజయ్య, సహాయ కమిషనర్ దేవాదాయ శాఖ శ్రీరామ్ రవీందర్.,కార్యనిర్వాహన అధికారి ప్రభులు పర్యవేక్షిస్తున్నారు. నాగిరెడ్డి పేటలో త్రీ లింగేశ్వర ఆలయం. రామారెడ్డి మండలం మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. బిక్కనూరు సిద్ధ రామేశ్వరాలయంలో ఏర్పాట్లకు పూర్తి చేశారు.