స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సంజయ్
కరీంనగర్ సిటీ, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : కరీంనగర్ కార్పొరేషన్ పరిధి 19 డివిజన్ లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పున నిర్మించి ప్రతిష్టించిన ఆలయాన్ని ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ పంచముఖ ఆంజనేయ స్వామి రేకుర్తిలోని ప్రజలు, పాడి పంటలు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు, నాయకులు అజయ్ వర్మ, శక్తి కేంద్ర ఇంచార్జి పొన్నాల రాములు, 19వ డివిజన్ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి గోదారి నరేష్, సాయికుమార్, బూత్ అధ్యక్షులు చరణ్, ఉపేందర్, రవి నాయక్, రాజేష్, రావుల భాస్కరాచారి, జాడి ఎల్లయ్య, చందు, కుల సంఘ నాయకులు అస్తపురం నారాయణ, ఏదుల లింగయ్య, మాజీ ఎంపిటిసి కుంబాల కిష్టయ్య, గోదరి సంపత్ ,దుర్గం ప్రభాకర్, వడ్ల రవి, శంకర్ ,నాగి అశోక్ వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మండలంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన
కరీంనగర్ సిటీ, డిసెంబర్ 29 (విజయక్రాంతి) కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో ఆదివారం రాత్రి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించారు. గ్రామంలోని బిజెపి నేతలు దాది సుధాకర్, సాయవేని సదానందం, దళిత మోర్చ నాయకులు గాలిపెల్లి నారాయణ నివాస గృహాల్లో జరిగిన శుభ కార్య కార్యక్రమాలకు హాజరయ్యారు.
గ్రామంలో ఇటీవల ప్రతిష్టాపన చేసిన భీరయ్యా - మహంకాళి మాత దేవాలయాన్ని దర్శించారు. అనంతరం కార్యకర్తల తో కలిసి ప్రధాని నరేంద్రమోడీ మన్‌కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ , మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్షి పాశం తిరుపతి, ఓబీసీ మోర్చా రాష్ర్ట కార్యవర్గ సభ్యులు చింధం అశోక్, కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు రమణ రెడ్డి, మహిళా మోర్చ అధ్యక్షురాలు మేకలపద్మ మండల నాయకులు బాలి సత్యం, శ్రీనివాస్, కుకట్ల. రమేష్, ప్రవీణ్, వెంకటేష్ , తోట సాయి, లక్ష్మణ్, ఆంజనేయులు, శ్రీకాంత్, కార్తీక్ పాల్గొన్నారు.