ఎల్బీనగర్, ఫిబ్రవరి 3: వసంత (శ్రీ) పంచమి పురస్కరించుకొని చంపాపేటలోని కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానంలో సోమవారం ఉదయం 4:30 గంటలకు శ్రీ సరస్వతీ మాత అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, అనంతరం సామూహిక అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తమ చిన్నారు లతో అక్షరాభ్యాసాలు చేయించడానికి ఆలయానికి తరలివచ్చారు. సోమవారం ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, చిన్నారులతో అక్షర స్వీకార పూజలు నిర్వహించారు. భక్తులకు ఎండల నుంచి ఉపశమనం కొరకు టెంట్లు ఏర్పాట్లు చేశారు.
గత సంవత్సరము కన్నా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి విచ్చేసి అక్షరాభ్యా సాలు నిర్వహించడం విశేషం. ఆలయ కార్యనిర్వహణాధికారి లావణ్య ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు, అర్చకులు, సిబ్బంది భక్తులతో అక్షర స్వీకార కార్యక్రమాలు నిర్వహించారు.