calender_icon.png 2 April, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

01-04-2025 02:01:52 AM

  1. ఈద్గాల వద్ద వందలాదిమంది
  2. ముస్లిం సోదరుల ప్రార్థనలు 
  3. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి భువనగిరి మార్చి 31 ( విజయ క్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లాలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భువనగిరి పట్టణం, చౌటుప్పల్, మోత్కూరు, యాదగిరిగుట్ట, ఆలేరు, రామన్నపేట, వలిగొండ ,బీబీనగర్, భూదాన్ పోచంపల్లి, రాజాపేట, ఆత్మకూరు ( ఎం ) తదితర కేంద్రాలలోని మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.

ఈ సందర్భంగా  నూతన వస్త్రాలు ధరించిన పెద్దలు, చిన్నలు. ప్రత్యేకమైన అలంకరణలతో ప్రార్ధన స్థలాలకు చేరుకోవ డంతో ఆ ప్రాంతాలన్నీ ముస్లిం సోదరులతో కిటకిటలాడాయి. భువనగిరి పట్టణంలోనీ ఈద్గా వద్దకు వందలాదిమంది ముస్లింలు చేరుకొని ప్రత్యేక ప్రార్థన జరిపారు. వారి మత పెద్దలు ఉపన్యసించారు.

అనంతరం ఒకరి నొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థన స్థలానికి విచ్చేసిన  ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ ఎం హనుమంతరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆవేజ్ చిస్తి, కాంగ్రెస్ నాయకులు తంగేళ్లపల్లి రవికుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ ను శాలువలు కప్పి సన్మానించారు.  ఇటువంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా డీసీపీ ఆధ్వర్యంలో ఏసిపి పట్టణ రూరల్ ఎస్త్స్రలు బందోబస్తు నిర్వహించారు.

* బీబీనగర్ మండల కేంద్రంలో ఈద్గా ప్రాంగణంలో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ (శుభాకాంక్షలు) తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడి.  బీబీనగర్ మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి, పంజాల వెంకటేష్ గౌడ్ ,కాసుల రఘునందన్ గౌడ్, పొట్ట నవీన్, ముస్లిం పెద్దలు మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి అక్బర్, మాజీ ఉపసర్పంచ్ దస్తగిరి, ఎండి మోయిన్, మిట్టు, మస్తాన్, అస్లాం, మోయినవుద్దిన్, మిస్బా, అస్గర్ అలీ, జహంగీర్, రషీద్, ఫసియుద్దిన్, షరీఫ్, ఖలీల్, జానీ పాషా, కరీం, ఇక్బాల్  పాల్గొన్నారు.