12-03-2025 08:15:51 PM
బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్
కొండపాక: భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షులుగా నియమితులైన బైరి శంకర్, కుకునూరుపల్లి మండలానికి విచ్చేసిన సందర్భంగా బీజేపీ అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి ఘన స్వాగతం పలికి సన్మానం చేశారు. అనంతరం కుకునూరు పల్లి మండలంలో పెద్దమ్మతల్లి ప్రథమ వార్షికోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ పెద్దలు బైరి శంకర్ కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు, కుకునూరుపల్లి ముదిరాజ్ సంఘం నాయకులు, సభ్యులు హిందూ సోదరులు పాల్గొన్నారు.