29-03-2025 12:13:00 AM
ముషీరాబాద్, మార్చి 28, (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు స్థానికంగా ఉన్న మసీదులకు వేల సంఖ్యలో వెళ్లి ప్రార్థనలు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్పూర్ లో 400 సంవత్సరాల చరిత్ర గల ప్రసిద్ధిగాంచిన బడి మసీదులో ఒకేసారి 5 వేల మందికి పైగా ముస్లిం సోదరు లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మసీదులో అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నట్లు మసీదు ముత్తవల్లి నజీర్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా బడి మసీదు వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
భోలక్ పూర్ బడి మసీదులో ఇఫ్తార్
పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్ పూర్ లోని బడీ మసీదులో శుక్రవారం ముషీరాబాద్ బీఆర్‌ఎస్ డివిజన్ ఉ పాధ్యక్షుడు ఎండి మోహిన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించారు. ఉపవాస దీక్షలు పూర్తయిన అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బడీమసీదు ముత్తవల్లి నజీర్‌అలీ, సలీమ్, జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు.