calender_icon.png 4 April, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగన్నకు మంత్రి పదవి రావాలని ప్రత్యేక పూజలు

04-04-2025 12:07:15 AM

అబ్దుల్లాపూర్‌మెట్, ఏఫ్రిల్ 3: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబినెట్ విస్తరణకు కసరత్తు చేస్తున్న తరుణంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలని పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీకి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు గురువారం ఇబ్రహీంపట్నం కట్ట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రంగన్నకు మంత్రివర్గంలో చోటు దక్కేలా చూడాలని కట్టమైసమ్మతల్లి కోరుకుట్లున్న తెలిపారు. రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు కల్పించేవిధంగా చూడాలని కాంగ్రెస్ అధినాయకత్వానికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రభు త్వానికి కోరుతున్నామన్నారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి భారీ మెజార్టీతో గెలిపించామని... రంగన్నకు మంత్రివర్గంలో చోటు దక్కితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.