calender_icon.png 4 April, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైసిగండిలో భక్తుల ప్రత్యేక పూజలు

31-03-2025 12:22:37 AM

కడ్తాల్, మార్చి 30 ( విజయ క్రాంతి ) : ఉగాది పర్వదిన వేడుకలు పురస్కరించుకొని ఆదివారం మైసిగండి ఆలయానికి భక్తులు పోటెత్తారు.  రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ నుంచి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం  తెల్లవారుజామున నుంచి భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ అమ్మవారికి ప్రత్యే క పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం... అందుకే ప్రతి గురువారం,ఆదివారం  మనిషి గడియారం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో స్నేహలత, ఆలయ శిరోలి లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.