మందమర్రి (విజయక్రాంతి): చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(MLA Vivek Venkataswamy)కి మంత్రి పదవి రావాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుంగపిండి రాజేష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుదవారం జిల్లాలోని జైపూర్ మండలం వేలాల గ్రామంలోని గట్టు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో పెద్దపల్లి ఎంపీగా ఉండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేసిన ప్రస్తుత చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కేటాయించాలని కోరారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను ఓడించి అత్యధిక మెజారిటీతో గెలిచిన వివేక్ కి మంత్రి పదవి రావాలని తద్వార నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.