* పెట్టుబడి, ఉపాధి కల్పన బట్టి కేటాయింపులు
* పారిశ్రామికవేత్తలకు మెరుగైన ప్రోత్సాహకాలు
* హైటెక్ సిటీ తరహాలో త్వరలో రెండు కొత్త ఐటీ పార్కులు
* రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేం దుకు ముందుకొచ్చే పారిశ్రమికవేత్తలు, ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం తగినంత భూమి కేటాయిస్తుందని, అందుకు అనుగుణంగా ప్రత్యేక పాలసీ అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
హైదరాబాద్ శివార్లలో హైటెక్ సిటీ తరహాలోనే త్వరలో మరో రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఐటీ పార్కుల్లో పనిచేసే ఉద్యోగులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. సిటీలో ఎక్కడి నుంచి, ఎక్కడికైనా పార్కులకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం ఆయన ‘డ్యూ’ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. భూకేటాయింపుల కోసం ఇప్పటివరకు ప్రత్యేక పాలసీ అంటూ ఏదీ లేదని, దీంతో పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఆ సమస్యకు పరిష్కారం చూపేందుకే తమ ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించాలని నిర్ణయించిందని తేల్చిచెప్పారు. సదరు కంపెనీలు పెడుతున్న పెట్టుబడితో ఉద్యోగాల సంఖ్యను బట్టి భూమి కేటాయింపులు చేస్తామని ప్రకటించారు. అనం తరం హైదరాబాద్‌లో పెట్టుబ డులు పెట్టేందుకు ముందుకొచ్చిన డ్యూ సాఫ్ట్‌వేర్ కంపె నీని ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
వచ్చే ఐదేళ్లలో తమ సంస్థ ద్వారా 900 మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. భేటీలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, టీజీఐఐసీ సీఈ వో మధుసూదన్, ‘డ్యూ’ వెంచర్స్ ప్రెసిడెం ట్ సురేశ్, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు.
‘అలేరియా ఏఐ’తో పన్నుల రాబడి మెరుగు
రాష్ట్రప్రభుత్వం పన్నులతో పాటు ఇతర రాబడి మార్గాల్లో నష్టపోకుండా ‘అలేరియా ఏఐ’ సాంకేతికత మెరుగైన సేవ లు అందిస్తున్నదని ఐటీ, పరిశ్రమల మం త్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో మం గళవారం ఆయన అలేరియా ఏఐ’ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు సాంకేతికతపై మంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆఫ్‌లైన్‌లో పనిచేసే ఈ టూల్‌ను ప్రభుత్వపరిధిలోని అన్ని విభాగాలకూ అనుసం ధానించాల్సి ఉందన్నారు. తద్వారా రాబడిలో నష్టపోతున్న 30శాతాన్ని తిరిగి పొం దవచ్చని వెల్లడించారు.
సాంకేతికత ద్వారా కేవలం అర్హులు మాత్రమే ప్రయోజనం పొందేలా పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఫ్రాన్స్, యూఏఈ వంటి దేశా ల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ సాంకేతికత అమలులో ఉందని, రాష్ట్రంలో నూ అమలు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐబీటీ సీఈవో మన్సూర్ అలీ ఖాన్, ‘అలెరియా ఏఐ’ సీఈవో ఎరిక్ లియాండ్రీ, ‘ఇన్నోలాజిక్’ సీఈవో శివ దొండపాటి పాల్గొన్నారు.