calender_icon.png 24 November, 2024 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక పోలీస్ బెటాలియన్ సమస్యలను పరిష్కరించాలి

29-10-2024 07:53:45 PM

ముషీరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక బెటాలియన్ పోలీసులు, వారి కుటుంబ సభ్యులు గత మూడు రోజులుగా చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని పౌర హక్కుల సంఘం నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో ప్రత్యేక హోంశాఖ లేకపోవడం, అది సీఎం రేవంత్ రెడ్డి కలిగి ఉండడంతో వారి వినతిపత్రం కూడా అందించలేని స్థితిలో ఉండడం శోచనీయమన్నారు. ఏ సమస్యలతో వచ్చిన ఏ ఉద్యోగ వర్గాన్నైనా చర్చలు కొనసాగించి వారి డిమాండ్లను పరిష్కరించాల్సిందని, కానీ పోలీసులు సమస్య కోసం రోడ్డెక్కితే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తొలగించడం దుర్మార్గమని, ఆ తొలగించిన 39 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు మంగళవారం హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యకుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, కార్యవర్గ సభ్యులు లింగన్న, విష్ణువర్ధన్రావులు మాట్లాడుతూ ప్రత్యేక బెటాలియన్ పోలీసులు సివిల్ పోలీసుల మాదిరిగా 3 నుంచి 5 ఏళ్ల వరకు ఒకేచోట ఉద్యోగం కల్పించాలని తమిళనాడు రాష్ట్రం గతంలో అమలైనట్లుగానే ఏకీకృత పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని వారు గుర్తు చేశారు.

ఒకే రాష్ట్రం, ఒకే పోలీస్ వ్యవస్థ అనే వారి ప్రధాన డిమాండేపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించి చట్టబద్దంగా న్యాయమైన సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు మనవతా దృక్పదంతో వ్యవహరించకుండా వారిపై అణచివేతను ప్రయోగిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం 39 మందిని డీస్మీన్ చేసినట్లు ప్రకటించడం అప్రజాస్వామికం అన్నారు. ఈ చర్చను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారన్నారు. పోలీసులు ఆందోళన చేస్తే క్రమశిక్షణల్లో తొలగిస్తే రాష్ట్ర పోలీసు సంఘం నేతలు ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, పోలీసులు పాలకులకు మడుగులోత్తితేనే వ్యతిరేకిస్తామని వారన్నారు.