calender_icon.png 25 January, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందు గర్భంలో స్త్రీకి ప్రత్యేక స్థానం

24-01-2025 11:00:18 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): హిందు గర్భంలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంటుందని నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా న్యూ అంబేద్కర్ భవన్‌లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. అనాదికాలం నుండి హిందు ధర్మంలో స్త్రీకి ప్రత్యేక స్థానం కల్పించి గౌరవిస్తున్నామన్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టింది అంటే ఇంటికి బరువుల బావించే రోజుల నుండి ఆడబిడ్డ పుడితే ఇంటికి వెలుగు అని భావించే స్థాయికి చేరుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ బిజెపి పాలన వచ్చాక దేశ వ్యాప్తంగా బాలికల, సంరక్షణ విద్య, ఆరోగ్యం సామాజిక ఎదుగుదల కోసం వారి అభివృద్దె లక్ష్యంగా పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. సుకన్య సంవృద్ది యోజన పథకం ద్వారా పదేళ్లలోపు బాలికలకు ఆర్థిక భరోసాగా కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

లబ్దిదారులు చెల్లించే మొత్తానికి 8.20 వడ్డీ తిరిగి కేంద్ర ప్రభుత్వం పిల్లల చదువు సమయంలో పెళ్లి సమయంలో పెద్ద మొత్తాన్ని చెల్లిస్తుందన్నారు. బేటి  బచావో భేటి పడవో ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదవానిద్దాం అనే నినదాంతో వారిలో అక్షరాస్యత పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందన్నారు. అటల్ జీ కాలంలోనే సర్వశిక్ష అభియాన్ ద్వారా ఉచిత విద్యకు కృషి చేస్తారని గుర్తు చేశారు. బాల్య వివాహాలలో గత సంవత్సరం చుస్తే ఇందూర్ జిల్లాలో దాదాపు 34 జరిగాయని, వాటి నిర్ములనకు అధికారులు, సంఘ సంస్కర్తలు అందరు కృషి చేయాలని ముఖ్యంగా తల్లితండ్రుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక కడుపులో బిడ్డను చంపుకునే భృణ హత్యలు కూడా తగ్గినాయన్నారు. గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ఫోషన్ మహాద్వారా పౌష్టికా ఆహారాన్ని కేంద్రమే అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ కమిషన్ సభ్యురాలు లక్ష్మి, నగర మేయర్, దండు నీతూ కిరణ్, డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ రాజశ్రీ,  డిడబ్లువో  రసూల్, ఆల్ ఇండియా రేడియో పోగ్రామర్ మోహన్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్  భాగ్యలక్ష్మి, మెప్మా డిస్టిక్ కో ఆర్డినేటర్ మాధురి తదితరులు పాల్గొన్నారు.