హైదరాబాద్, సెప్టెంబర్ 5(విజయక్రాంతి): మధ్యప్రదశ్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారికోసం స్పెషల్ ప్యాకేజీలు అందిస్తున్నట్లు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్ దిషా ముఖర్జీ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆమె ఎంపీలో చూడదగ్గ ప్రదేశాలు, అక్కడ అందిస్తున్న సౌకర్యాలు, ప్యాకేజీల గురించి వివరించారు. ఇక్కడ నిర్వహించిన ఈవెంట్ తమ పర్యాటకానికి దోహదపడుతుందని వెల్లడించారు. ఎంపీలో చూడదగ్గ ప్రదేశాలు అనేకం ఉన్నాయని, వాటిని సందర్శించాలని ఆమె కోరారు.