22-02-2025 01:41:20 AM
* ఇసుక ట్రాక్టర్లకు ముందు పైలెట్ వెనుక ఎస్కార్ట్
*ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇసుక కట్టడిపై కట్టుదిట్టం
* ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇసుక అక్రమార్కులు
*కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
* ఇప్పటికే సంబంధిత అధికారులతో కలెక్టర్, ఎస్పీ సమీక్ష సమావేశాలు
వనపర్తి, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ప్రకృతిలో సహజంగా లభించే ఇసుకను ఎక్కడికక్కడ కొందరు అక్రమదారులు ఇసుకను దొంగతనంగా దాచిపెట్టి ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. వనపర్తి, గద్వాల జిల్లాలలో అక్రమార్కులు ఇసుకను అడ్డగోలుగా తోడేస్తున్నారు.
రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్, లారీ ల ద్వారా ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. నీటి జాడలు అడుగంటుతున్న సమయంలో చెరువులు కుంటలు వాగులు వంకల్లో ఉన్న ఇసుక మెటలను కొందరు దళారులు రాత్రికి రాత్రే ఖాళీ చేస్తున్నారు. ఆపై తమ ఇష్టానుసారంగా ట్రాఫిక్ నిబంధన కాలరాస్తు ఇసుక వ్యాపారులు రెచ్చిపోతున్నారు.
ఇసుకను తరలించే ట్రాక్టర్ కు నెంబర్ ప్లేట్ లో గల సంఖ్యలను చెరిపేసి రాత్రింబవళ్లు ఇసుకను తరలిస్తున్నారు. ఇంతకాలం మూడు పూవు లు ఆరు కాయలుగా సాగిన ఇసుక దందా ఒక్క సారిగా ఆగిపోతుందని అక్రమార్కులు సతమతమవుతున్నారు.
ఇసుక ట్రాక్టర్లకు ముందు పైలెట్ వెనుక ఎస్కార్ట్
సాధారణంగా రాష్ర్ట మంత్రుల నుండి అపైన గల వారికి వాహనం ముందు పైలెట్ వెనక ఎస్కార్ట్ ఉండడం అందరం చూస్తుం టాం. ఇదే తరహాలో అక్రమ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లకు సైతం ముందు పైలెట్ వెనుక ఎస్కార్ట్ తరహాలో ఉంటూ ఇసుకను దోచేస్తున్నారు. వాగులు వంకలు చెరువులు కుం టల నుండి దొంగతనంగా తీసుకుని వచ్చిన ఇసుకను రహదారులకు లోపల అడ్డాను ఏర్పాటు చేసుకొని అక్కడే ఒక ఫిల్టర్ యం త్రం ద్వారా ఇసుకను పూర్తిస్థాయిలో ఫిల్టర్ చేసి అక్కడినుండి ముందుగానే ఒప్పందం చేసుకున్న గృహ నివాసాలకు దగ్గరకు చేర్చుతుంటారు.
ఇసుక అడ్డా నుంచి ట్రాక్టర్ బయలుదేరక ముందు ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి ముందుగా వెళ్లి పోలీసులు, విజిలెన్స్, రవాణాశాఖ అధికారులు చెకింగ్ చేస్తున్నారా ఉన్నారా వంటి విషయాలను గమనిస్తూ ట్రాక్టర్ డ్రైవర్ కు సమాచారాన్ని చేరవేస్తే అప్పుడు ట్రాక్టర్ బయలుదేరుతుంది ట్రాక్టర్ బయలుదేరిన తర్వాత వెనకా ల మరో ద్విచక్ర వాహనంపై ట్రాక్టర్ అనుసరిస్తూ ఎవరైనా వస్తున్నారా లేదా వంటి విషయాలను చూసుకుంటూ ఒకవేళ ట్రాక్టర్ పట్టుపడితే అక్కడే పరిష్కార దిశగా చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమై ఉంటారు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇసుక కట్టడిపై కట్టుదిట్టం
రాష్ర్ట ప్రభుత్వం రాష్ర్ట వ్యాప్తంగా ఇసుక పాలసీని తీసుకునివచ్చి ఇందిరమ్మ ఇండ్లతో పాటు సామాన్యులకు అందుబాటు ధరకు ఇసుకను సరఫరా చేయాలని ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో రాష్ర్ట అధికారుల నుండి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లు సంబంధిత అధికారులతో ఇప్పటికే కట్టడిపై సమా వేశాలు, సమీక్షలను నిర్వహించారు. జిల్లాలకు నలువైపులా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కట్టడ చేసే దిశగా మమ్మురం చేశారు.
ఉక్కిరిబిక్కిరి అవుతున్న అక్రమార్కులు
దశాబ్దాలుగా కొంతమంది ఇసుక అక్రమ రవాణాలతో కోట్లకు పడగలేత్తారు. గతం లో సంబంధిత అధికారులకు, చిన్న పెద్ద నాయకులకు మంచి మర్యాదలు చేస్తూ ఇసుక దోపిడీని యదేచ్చగా నిర్వహించేవా రు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇసుక కట్టడి చేయాలని ఆదేశాలు రావడంతో ఎవరు కూ డా నోరు మెదపని పరిస్థితి ఏర్పడింది. దీం తో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అక్రమార్కులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
వనపర్తి జిల్లా ప్రజల అవసరాల మేరకు మన ఇసుక వాహనం ద్వారా ఇంటి వద్ద కె ఇసుక సరఫరా చేసేలా ఇసుకకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రజల కోసం వనపర్తి కలెక్టరేట్ లోని రూమ్ 115 లో లేదా కంట్రోల్ రూమ్ 08545 2335 25 నెంబర్‌ను వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభి ఏర్పాటు చేశారు. ఇసుక రీ ల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇసుక ఉంచేలా సంబం దించిన అధికారులకు కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు.