calender_icon.png 23 December, 2024 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్య వివాహాలపై స్పెషల్ ఆపరేషన్

23-12-2024 01:56:19 AM

* 416 మందిని అదుపులో తీసుకున్న అస్సాం పోలీసులు

గౌహతి, డిసెంబర్ 22: బాల్య వివాహాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న అస్సాం ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి, అక్టోబర్ నెలల్లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది. తాజాగా డిసెంబర్ 21, 22 తేదీల్లో మూడో దశ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు సుమారు 416 మందిని అదుపులోకి తీసుకొని, 335 కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసినవారిని కోర్టులో హాజరుపరుచనున్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను అంతం చేయడానికి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. గతేడాది ఫిబ్రవరిలో జరి గిన మొదటిదశ ఆపరేషన్‌లో 4,515 కేసు లు నమోదు చేసి 3,483 మందిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరిలో జరిగిన రెండో దశలో 710 మందిపై కేసులు నమోదు చేసి 915 మందిని అదుపులోకి తీసుకున్నారు.