calender_icon.png 20 January, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తాలేని ప్రత్యేకాధికారులు..!

07-12-2024 02:23:38 AM

పల్లెల్లో పడకేసిన అభివృద్ధి

సిరిసిల్ల, డిసెంబర్ ౬ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. కానీ వారు తమ శాఖ పనులతోనే బిజీ ఉండటంతో గ్రామాలను సందర్శించడంలేదు. దీంతో పల్లెల్లో అభివృద్ధి కుంటు పడింది. సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలుండగా, 2,268 వార్డులు ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శితోపాటు ప్రత్యేకాధికారులకు చెక్ పవర్ అప్పగించడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే తప్పనిసరిగా ప్రత్యేకాధికారుల అనుమతితోనే ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది.

కానీ ప్రత్యేకాధికారుల మాత్రం పంచాయతీల వైపు కన్నెత్తి చూడటం లేదు. తప్పని పరిస్థితుల్లో అధికారి ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి, పనులు చేసుకునే పరిస్థితి నెలకొంది. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి పైపు లైన్, వీధి దీపాల నిర్వహణను కార్యదర్వులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. పంచా యతీ కార్మికుల జీతాలు ఇవ్వడంలో కూడా జాప్యం జరుగుతోంది.