- 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు..
- పదవీకాలం ముగియడంతో సర్కార్ నిర్ణయం
- రేపటితో కరీంనగర్ కార్పొరేషన్ పదవీకాలం ముగింపు
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్ల పాలకవర్గాల పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో వీటికి ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈనెల 28తో కరీంనగర్ కార్పోరేషన్ పాలకవర్గం పదవీ కాలం కూడా ముగియనుంది. రాష్ట్రంలో 2020లో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి 5 ఏళ్లపాటు పాలకవర్గాలు కొనసాగాయి.