calender_icon.png 10 January, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండల పరిషత్‌లకు స్పెషల్ ఆఫీసర్లు

04-07-2024 12:57:11 AM

నిన్నటితో ముగిసిన ఎంపీపీల పదవీకాలం

హైదరాబాద్, జూలై 3(విజయక్రాంతి): రాష్ట్రంలోని ఎంపీపీల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కు మార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 540ఎంపీపీలు ఉండగా వీరి పదవీకాలం బుధవారంతో ముగిసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అన్ని ఎంపీపీలు, జడ్చర్ల, నాగర్‌కర్నూల్, గార్ల, బయ్యారం, వాజేడు, వెంకటాపురం ఎంపీపీ ల పదవీ కాలం ఇంకా ముగియకపోవడంతో వీటిని మినహాయించారు.

స్పెషల్ ఆఫీసర్లు నియామకంపై మార్గ దర్శకాలు జారీ చేస్తూ ఆ అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది. డిప్యూటీ డైరెక్టర్లు, ఆర్డీవోలు, ఇతర జిల్లా అధి కారులు (ఇంజినీర్లు కాకుండా), ఎంపీడీవో ఆ పైస్థాయి అధికారులుగా పనిచేసిన వారిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించవచ్చని పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్‌లకు ఎన్నికలు జరిగి గెలిచిన వారు బాధ్యతలు స్వీకరించే వరకు వీరు కొనసాగనున్నారు. జిల్లాల వారీగా కలెక్టర్లు వారి పరిధిలోని మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ బుధవారమే ఉత్తర్వులు జారీ చేశారు.