calender_icon.png 1 April, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ప్రత్యేక అధికారి మర్రి ప్రదీప్

30-03-2025 05:59:13 PM

కొండాపూర్: కొండాపూర్ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో ఎన్ఆర్జిఎస్ కింద మంజూరైన సీసీ రోడ్డు పనులను ప్రత్యేక అధికారి మర్రి ప్రదీప్ కుమార్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు చింత ప్రభాకర్ ఎంజిఎన్ఆర్జిఎస్ పథకం కింద 9 లక్షల రూపాయల వ్యయంతో సుమారు 200 మీటర్ల సీసీ రోడ్లు మంజూరు చేయించారని అన్నారు. ఈ సందర్భంగా ఉగాది నూతన సంవత్సరానికి పురస్కరించుకొని ఇట్టి పనులకు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు పద్మావతి పాండురంగం, మాజీ ఎంపీపీ విట్టల్ మాజీ ఎంపిటిసి రాందాస్ మాజీ సర్పంచ్ శివలీల జగదీశ్వర్, పంచాయతీ కార్యదర్శి కట్కం శ్రీనివాస్ జిల్లా నాయకులు నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ మానేయ్య, ఉప సర్పంచ్ రామప్ప, రాజిరెడ్డి, భాస్కర్ లక్ష్మిరెడ్డి, సుధాకర్, గ్రామస్తులు దయానందం, సత్యానందం, మాణిక్యం శిమన్, రాజు తదితరులు పాల్గొన్నారు.