09-04-2025 12:00:00 AM
వరల్డ్ హెల్త్‌డే సందర్భంగా ప్రత్యేక మెంబర్‌షిప్ కార్డు
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): వరల్డ్ హెల్త్‌డే సందర్భంగా కేర్ హాస్పిటల్స్ సరికొత్త ‘సంఘం’ అనే ప్రత్యేక మెంబర్‌షిప్ కార్డును ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కేర్ హాస్పిటల్స్ తన కట్టుబాటును మరింత బలోపేతం చేసింది. హైదరాబాద్‌లోని అన్ని కేర్ హాస్పిటల్స్‌లో ఈ కార్యక్ర మాన్ని ప్రారంభించారు. బంజారాహిల్స్ ఆసుపత్రిలో క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా ప్రారంభించగా, ఇతర ఆసుపత్రుల్లో గ్రూప్ సీఎఫ్‌ఓ విశాల్ మహేశ్వరి, గ్రూప్ సీఈవో జస్దీప్ సింగ్, గ్రూప్ చీఫ్ సేల్స్, మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్, మెడికల్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ నిఖిల్ మాథుర్, సీహెచ్‌ఆర్‌ఓ డాక్టర్ అమిత్ సింగ్, తెలంగాణ మాజీ డీసీపీ డాక్టర్ ఆర్.ఎస్.వి. బద్రినాథ్ పాల్గొన్నారు.
‘సంఘం’ కార్డ్ ద్వారా రోగులకు ప్రాధాన్యత కలిగిన సేవలు, అత్యవసర సేవలు, వైద్య చికిత్సలపై ప్రత్యేక డిస్కౌంట్లు లభించనున్నాయి. ఈ కార్డ్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, బంజారా హిల్స్, నాంపల్లి, ముషీరాబాద్, మలక్‌పేట కేర్ హాస్పిటల్‌సలో అందుబాటులో ఉంటుంది. క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా మాట్లాడుతూ.. ‘సంఘం’ సభ్యులకు 24/7 ప్రాధాన్యమిచ్చి వైద్య సేవలు అందించబడతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో, సభ్యులు 5 కిలోమీటర్ల పరిధిలో ఉచిత అం బులెన్స్ పికప్ పొందగలుగుతారు. 040-6810 6541 నంబర్‌కు కాల్ చేసి 24 గం టలు సహాయం పొందవచ్చన్నారు.