calender_icon.png 28 September, 2024 | 6:51 AM

రేషన్, హెల్త్ కార్డుల కోసం జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు

28-09-2024 02:29:00 AM

గాంధీ భవన్‌లో ముఖాముఖిలో మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): గాంధీ భవన్‌లో మంత్రుల ముఖా ముఖి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. సామాన్య ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులు స్వీకరించిన మంత్రి.. నేరుగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

ఉద యం 11.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ప్రజల నుంచి దాదాపు 320 అర్జీలను మంత్రి స్వీకరించారు. బాధితుల్లో చాలా మంది భూ సమస్యలు, 317 జీవో, రేషన్ కార్డు, మల్లన్నసాగర్, సహారా కంపెనీ, డీకేజెడ్ కంపెనీ బాధితులు, పెన్షన్‌లు వంటి సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

రేషన్, హెల్త్ కార్డుల జారీ కోసం త్వరలోనే ప్రత్యేక సమావేశాలు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వీటికి సంబంధించిన సమస్యలపై వచ్చిన వారు ఆయా ప్రాంతాల్లోనే ప్రత్యేక సమావేశాల్లో దరఖాస్తులు పెట్టుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పాల్గొన్నారు.