రూ. 2.75 లక్షలతో డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభం..
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ డివిజన్ లోని బాలాజీ నగర్ లో రూ. 2.75 లక్షల వ్యయంతో డ్రైనేజ్ పైప్ లైన్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరుగుతున్న డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులతో పాటు పలు అభివృద్ధి పనులను త్వరితగతన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకులు ముఠా జై సింహా, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సురేందర్, శ్యాంసుందర్ చిట్టి, నేత శీను, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, అస్లాం, సుధాకర్ గుప్తా, రవి యాదవ్, బొట్టు శీను, మాధవ్, అబ్బు బాయ్, బిక్షపతి, యునెస్, ముషీరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, బల్ల ప్రశాంత్, జలమండలి అధికారి ఏఈ శివప్రసాద్, బస్తి వాసులు మహేష్ రెడ్డి, మాణిక్ ప్రభు, నర్సింగ్ రావు, రమేష్, భాస్కర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.